Posts

Showing posts with the label Andhrapradesh elections

సైకిలెక్కి ఫ్యానుగాలికి చేతిలో గాజుగ్లాసుతో... ఓటెవరికో?

Image
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుని దావానలంలా మండిపోతోంది. అన్ని ప్రధాన పార్టీల నాయకులూ మేమే గెలుస్తాం , మాదే అధికారం అంటూ మైకులెత్తి చాటేసుకుంటున్నారు. మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగబోతున్న ఎన్నికల్లో ఇంతకీ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దామా!!! 2019 ఎలక్షన్స్ లో ఎవరి బలాబలాలు ఎంతమాత్రం?  ముందుగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే... గత ఎన్నికల్లో ఓటమి శిఖరాల అంచుల దాకా వెళ్ళొచ్చి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన అధికారపగ్గాలు చేపట్టి ఐదు సంవత్సరాల అధికారాన్ని , నూతన రాష్ట్ర నిర్మాణాన్ని , ఆధునాతన రాజధాని నిర్మాణ బాధ్యతల్ని అందుకుంది. అయితే చెప్పిన మాటలు చెప్పినట్టుగా నిలబెట్టుకోవడంలో విఫలం కావడం , ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవడం , అవినీతి ఆరోపణలు , ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంతోనే మొత్తానికి ఐదేళ్ళ కాలాన్ని చుట్టేసింది. ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మరోసారి అధికారం చేజిక్కించుకోవడం కష్టతరమైన పనే అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం నా అభిప్రాయమే కాదండోయ్... లోలోపల సాక్షాత్తూ తెదేపా పెద్దలందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తి...