రాజన్న అనుభూతుల “యాత్ర”
ముఖ్య గమనిక: తెలుపు, ఆకుపచ్చ, కాషాయం, పసుపు పచ్చ, నీలం వగైరా రంగుల జెండాలు, అజెండాలు కాసేపు పక్కనెట్టి ఈ విశ్లేషణ చదవాల్సిందిగా మనవి. నిన్న మధ్యాహ్నం థియేటర్లో ఒంటరిగా కూర్చుని చాలా రోజుల తర్వాత తనివితీరా అనుభూతుల ఝడిలో తడిసి ముద్దయ్యా... చెరిగిపోని దరహాసాల ఝరి రాజన్న ను మళ్లీ ఓ సారి గుండెనిండుగా చూసుకున్నా. నేనేదో కాంగ్రెస్ వాదినో, లేక వైకాపా మద్దతుదారుడినో అనుకోకండి. "యాత్ర" సినిమా చూస్తున్నంత సేపు నాకు ఈ అనుభూతులే కలిగాయ్. బయోపిక్ అంటే ఏంటో తెలుగువారికి అంత అనుభవజ్ణుడైన దర్శకుడు కాకపోయినా “మహి“ చూపించాడు మరి. అప్పట్లో వచ్చిన "సచిన్ టెండుల్కర్" బయోపిక్ ఒక నిజమైన బయోపిక్ అయితే మళ్లీ ఇప్పుడు ఈ యాత్ర వచ్చింది. బయోపిక్ అంటే నా ఉద్దేశ్యంలో పాత్రధారుడు మనకు కనిపించకూడదు, కేవలం ఆ పాత్ర మరోసారి మన కళ్ళ ముందు మెదలాలి. అదే అనుభూతి నాకు యాత్ర సినిమా చూస్తున్నంత సేపు కలిగింది. సినీ స్వాతంత్ర్యం తీసుకున్నప్పటికీ ఎక్కడా రాజన్న ఆత్మను పక్కకు పెట్టకుండా దర్శకుడు సినిమాను ముందుకు తీసికెళ్ళడంలో సక్సెస్ సాధించాడు. కథ లేకుండా సినిమా తీసి చూపిస్తా అంటూ అప్పట్ల...