Interesting facts about "Aithe" prestigious film from Just Yellow directed by Chandrasekhar Yeleti
తెలుగు సినిమా అంటే ఆరు పాటలు, ఐదు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు, మూడు సెంటిమెంట్ సన్నివేశాలు, ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో... ఇదీ 2000ల సవత్సరాలలో ఉన్న ఇంప్రెషన్. అఫ్ కోర్స్ అప్పట్లో చాలావరకూ సినిమాలు ఇదే ఫార్ములాతోనే వచ్చేవి. ఆ సమయంలో ఈ ట్రెండ్ బ్రేక్ చేస్తూ అందరినీ కట్టిపడేసిన సినిమా 2003 ఏప్రిల్ 11న విడుదలైన "“ఐతే”". సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్టే దీని ట్యాగ్ లైన్ కూడా వెరైటీగా అనిపించింది... "అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు". అదేలా ఈ సినిమా అప్పటి సినిమాలన్నింటికీ భిన్నంగా అనిపించింది కూడాను. దాదాపుగా అంతా కొత్త ఆర్టిస్టులు, కేవలం ఒకే ఒక్క పాట, పూర్తిగా స్క్రీన్ ప్లే పై నడిచే చిత్రం అండ్ ఫైనల్ రిజల్ట్... సూపర్ హిట్. “ఐతే” దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. తనకిది దర్శకుడిగా డెబ్యూ ఫిల్మ్. అంతకు ముందే "లిటిల్ సోల్జర్స్" వంటి ఓ వెరైటీ ఫిల్మ్ అందించిన దర్శకనిర్మాత గున్నం గంగరాజు “ఐతే” ఫిల్మ్ ప్రొడ్యూసర్. జస్ట్ యెల్లో మీడియా బేనర్ పై తెరకెక్కించిన గంగరాజు దర్శకుడు చందూకి క్లోజ్ రిలేటివ్ కూడా. మెరీన్ రేడియో ఆఫీసర్స్ కోర్స్ కంప్లీట్ చేసి గంగరాజు దగ్గర కాపీరైటర్ గా అండ...