మెరుగైన సమాజం కోసం.. ఇలా కూడా చెయ్యాలా?
సాధారణంగా ప్రతీ వారం టెలివిజన్ ఛానల్స్ ఓ పరీక్ష ఫలితాలకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అదే బార్క్ (BARC) ఛానల్ రేటింగ్స్. ఈ రేటింగ్స్ ఆధారంగా ఏ ఛానల్ ఆ వారంలో నంబర్ వన్ రేటింగ్ లో ఉందో తెలుస్తుంది. ఫలితం వచ్చాక షరామామూలే. మేమే నంబర్ వన్ అంటూ తమ తమ ఛానళ్ళలో ఊదరగొట్టేస్తారు. తెలుగురాష్ట్రాల్లో చాలావరకూ మొదటి రెండు స్థానాల కోసం ప్రముఖ న్యూస్ ఛానల్స్ టివి9, టివి5 పోటీపడడం జరుగుతూ వస్తోంది. నేనంటే నేను అన్నరీతిలో ఈ పోటీ స్వల్ప మార్జిన్ తో జరగడం ప్రతీవారం పోటీని మరింత రసవత్తరంగా మారుస్తూ వస్తోంది. అయితే ఎక్కువగా 9 వారిదే ఒకింత పైచేయిగా ఉండడం, కేవలం హైదరాబాద్ వరకు చూస్తే 5 వారిది పైచేయిగా ఉండడం జరుగుతోంది. అయితే ఈ వారం సదరు రేటింగ్స్ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ వారం రేటింగ్స్ లో టివి 5 నంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. అంటే 9 రెండవ స్థానంలో ఉందని కాదు. ఇక్కడే వచ్చింది పెద్ద మెలిక. టివి9 మరియు వి6 ఛానల్స్ కాసింత అనుమానం కలిగించేలాంటి పద్ధతులకు పాల్పడ్డం వల్ల 46 నుండి 49 వారాల వరకు రేటింగ్స్ లో సదరు ఛానళ్ళు ఉండబోవంటూ బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) ఇండియా వారు ఒక చిన్న గమనిక ఇ