Ram Pothineni "Hyper" Telugu movie review (రాం పోతినేని "హైపర్" సినిమా రివ్యూ )
ఎనర్జెటిక్ స్టార్ రాం పోతినేని "నేను శైలజ" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా "హైపర్". టాలీవుడ్ లో హైపర్ యాక్టివ్ హీరోగా పేరుతెచ్చుకున్న రాం ఇమేజ్ కు తగ్గ టైటిల్ తో, రాం కు 'కందిరీగ" వంటి సక్సెస్ అందించిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ హైపర్ ఈ రోజు అంటే 30 సెప్టెంబర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సక్సెస్ ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్న రాం, రాశీఖన్నా, ఇటీవలి కాలంలో "బాహుబలి" నుండి తెలుగు ప్రేక్షకులకు కట్టప్పగా సుపరిచితుడైన తమిళనటుడు సత్యరాజ్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ "హైపర్" సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దామా... హైపర్ సినిమా ఇప్పటికే అందరికీ తెలిసినట్టుగానే తండ్రీకొడుకుల పెనవేసుకున్న అనుబంధాలకు ప్రతిరూపమైన కథ. నారాయణ మూర్తి (సత్యరాజ్) ఒక నిజాయితీ అయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. వైజాగ్ లో భార్య శాంతి, కూతురు ప్రియాంక అండ్ కొడుకు సూర్య (రాం) లతో ఒక సాధారణ మధ్యతరగతి జీవితం సాగిస్తూ ఉంటాడు. 35 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసి రిటైర్మెంటుకు దగ్గర్లో ఉంటాడు. తండ్రంటే కొడుకుకు విపరీతమైన ప్రేమ, తండ్రి కోసం ఎంతదూరమ